20, ఏప్రిల్ 2024, శనివారం

జర్నలిస్టు పిల్లలకు ఉచిత క్రికెట్ శిక్షణ - వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన

జర్నలిస్టు పిల్లలకు ఉచిత క్రికెట్ శిక్షణ

కొడిమి జర్నలిస్ట్ కాలనీలో ఏప్రిల్ 29 నుంచి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం


10 నుంచి 25 సంవత్సరాల  వారికి శిక్షణ

జర్నలిస్టు పిల్లలను ఉత్తమ క్రికెటర్లుగా తీర్చడమే లక్ష్యం ప్రతిభను గుర్తించేందుకే శిక్షణా శిబిరం: మచ్చా రామలింగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు, ఏపిడబ్ల్యూజేయూ చైర్మన్, ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్(ఏపీఎస్డీటీ)

శ్రీసత్యసాయిజిల్లా/అనంతపురం ఏప్రిల్ 19(విజయస్వప్నం.నెట్)

ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఏపీఎస్పిడిటి) ఆధ్వర్యంలో అనంతపురం రూరల్ మండలంలోని కోడిమి గ్రామం, కొడిమి జర్నలిస్ట్ కాలనీలో ఈనెల(ఏప్రిల్) 29వ తేదీ నుంచి జిల్లాలోని జర్నలిస్టుల పిల్లలకు, బాలురకు, మహిళా క్రికెట్ పై ఆసక్తి ఉన్న చిన్నారులకు ప్రత్యేక వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు శుక్రవారం మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు(ఏపిడబ్ల్యూజేయూ) ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చైర్మన్ ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఏపీఎస్పిడిటి) తెలిపారు.జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టు పిల్లలను ఉత్తమ క్రికెటర్లగా తీర్చిదిద్దలనే లక్ష్యంతో వారికి మంచి శిక్షణ ఇచ్చి క్రికెటర్లుగా తయారు చేయాలన్న ఉద్దేశంతోనే జిల్లాలోని ప్రతిభ ఉన్న జర్నలిస్టు పిల్లలను,ఆసక్తి ఉన్న యువ క్రికెటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతిభ ఉన్న వారిని గుర్తించేందుకు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు.10 నుంచి 25 సంవత్సరాలలోపు ఉన్న యువకులందరూ ఈ ఉచిత క్రికెట్ శిక్షణలో పాల్గొనవచ్చునని, అందరూ ఉపయోగించుకోవాలని మచ్చా రామలింగారెడ్డి ఈసందర్భంగా కోరారు.రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా అనంతపురం జిల్లాలో కొడిమి జర్నలిస్టు కాలనీలో జర్నలిస్టుల పిల్లల కోసం ప్రత్యేకంగా ఉచితంగా క్రికెట్ శిక్షణ శిబిరం నిర్వహించడం ఒక్క రూపాయి కూడా రుసుం లేకుండా ఉచితంగా క్రికెట్ నేర్పించడం జరుగుతుందని,రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటువంటి ఉచిత క్రికెట్ శిక్షణ లేదని మచ్చా రామలింగారెడ్డి అన్నారు. ఎక్కడ క్రికెట్ శిక్షణ జరిగిన ప్రవేశ రుసుం వసూలు చేస్తారని,అటువంటిది జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లా లో వర్కింగ్ జర్నలిస్టు పిల్లలందరికీ కొడిమిలో ఉచితంగా క్రికెట్ శిక్షణ ఇస్తున్నామన్నారు.క్రికెట్ అంటే వ్యాపారంగా మారి పేదవాడికి అందుబాటులో లేకుండా పోతున్న ఇలాంటి పరిస్థితుల్లో ఉచితంగా నేర్పించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని మచ్చా అన్నారు.ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతమున్న శ్రీసత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టు పిల్లలందరూ ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా,చిన్న పత్రికలు,సబ్ ఎడిటర్ల పిల్లలు యూట్యూబ్ ఛానల్స్ పిల్లలు ఇతర మీడియాకు సంబంధించిన వారందరూ ఈ ఉచిత శిక్షణలో పాల్గొనవచ్చునని మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. క్రికెట్ కు అవసరమైన క్రికెట్ సామాగ్రి క్రీడాకారులకు ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఉచితంగా అందిస్తోందని మచ్చా రామలింగారెడ్డి తెలిపారు.క్రికెట్ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న జర్నలిస్టు పిల్లలు బాల బాలికలు ఈనెల 28వ తేదీ సాయంత్రంలోపు కొడిమి జర్నలిస్టు కాలనీలో క్రికెట్ అకాడమీలో ఆధార్ కార్డుతో నేరుగా వారి  పేర్లను నమోదు చేసుకోవచ్చని  మచ్చా తెలిపారు.ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం అనంతరం క్రికెటర్లకు ప్రముఖుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రధానం చేస్తారని మచ్చా రామలింగారెడ్డి పేర్కొంటూ.... సీనియర్ క్రికెటర్లతో క్రికెట్ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తారని, శిక్షణను ఇవ్వడానికి సీనియర్ క్రికెటర్లను ఇప్పటికే ఎంపిక చేశారని మచ్చా రామలింగారెడ్డి వివరించారు.క్రికెట్ నేర్చుకోవాలని ఆసక్తి వున్నవారు కె.విజయరాజు జిల్లా కార్యదర్శికి కొడిమి జర్నలిస్ట్ కాలనీలో దరఖాస్తులు ఇవ్వాలని, అలాగే 9490062555 నంబరులో ఇతర వివరాలకు సంప్రదించవచ్చునని మచ్చా రామలింగారెడ్డి తెలిపారు.

$$$__________@@@__________$$$

జనసేన పార్టీలోకి 60 కుటుంబ సభ్యులు చేరిక

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్19(విజయస్వప్నం.నెట్)

మండల పరిధిలోని తంగేడుకుంట పంచాయతీ మద్దకవారిపల్లి గ్రామానికి చెందిన 60 కుటుంబ సభ్యులు వైకాపా నుండి జనసేన పార్టీలోకి చేరారు.శుక్రవారం పుట్టపర్తి జనసేన పార్టీ సమన్వయకర్త పత్తి చంద్రశేఖర్ సమక్షంలో మద్దకవారిపల్లి 6,7 వార్డు సభ్యులతోపాటు వైకాపా చెందిన 60 కుటుంబాల సభ్యులు జనసేన పార్టీలోకి చేరినట్లు తెలిపారు.పార్టీలోకి చేరినవారికి జనసేన సమన్వయకర్త పత్తి చంద్రశేఖర్ కండువాలు కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేయాలని, గ్రామాల్లో పర్యటించి తెదేపా, జనసేన, బిజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్క జనసైనికుడు శ్రమించాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు మేకల ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి కొండబోయన సతీష్, తలసాని దివాకర్ రెడ్డి,సీసీ కెమెరా శంకర్, ఆర్ట్ శ్రీను, చంద్ర, ధనుంజయ, రియాజ్, బుక్కపట్నం మండల అధ్యక్షులు పూల శివ తదితర జనసైనికులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

తెదేపా పంచాయతీ ఇంఛార్జులను నియమించిన మాజీమంత్రి పల్లె

శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్19(విజయస్వప్నం.నెట్)

తెదేపా పుట్టపర్తి నియోజకవర్గ ఇంఛార్జ్, మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సూచనద మేరకు మండలంలోని తెదేపా పంచాయతీల ఇంఛార్జులను నియమించినట్లు తెదేపా శ్రేణులు తెలిపారు.త్వరలో ఎన్నికలు నిర్వహణలో భాగంగా పంచాయతీ గ్రామాల్లో తెదేపా ఇంఛార్జులను నియమించినట్లు తెలిపారు. అమడగూరు, చినగానిపల్లి గ్రామ పంచాయతీ ఇంఛార్జ్ గా శ్రీనివాసులురెడ్డి, కసముద్రం, జేకేపల్లి, మహమ్మదాబాద్ ఇంఛార్జ్ గోపాల్ రెడ్డి, తుమ్మల, కొట్టువారిపల్లికి, పూలకుంటపల్లి ఇంఛార్జ్ కృష్ణారెడ్డి, గుండువారిపల్లి, చీకిరేవులపల్లి పంచాయతీ ఇంఛార్జులను నియమించినట్లు పేర్కొంటూ.... ఓడిచెరువు మండల ఇంఛార్జ్ గా శ్యాంబాబు నాయుడును నియమించినట్లు తెలిపారు.

$$$__________@@@__________$$$

వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్19(విజయస్వప్నం.నెట్)

మండలంలోని సున్నంపల్లి పంచాయతీ మలక వారి పల్లి పెద్దగుట్టపల్లి సున్నంపల్లిలో ఆరోగ్య కార్యకర్తలు లక్ష్మి లలిత,ఆశ కార్యకర్తలతో కలిసి చిన్నారులకు వ్యాక్సిన్  కార్యక్రమం నిర్వహించారు.అనంతరం వేసవిలో ఎండ వేడిమితో వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తపడాలని వారు అవగాహన కల్పిస్తూ.... ప్రస్తుతం 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందనీ,తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ సోకినప్పుడు అత్యవసర ప్రధమ చికిత్సలు అందించకపోతే ప్రమాదం ఏర్పడుతుందని,వృద్దులు, చిన్న పిల్లలు ఎక్కువగా వడదెబ్బకు గురి కావచ్చని, వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తపడాలని, ఎండకు తిరగకుండా నీడలో వుండే విధంగా చూసుకోవాలని, అత్యవసరంగా బయటికి వెళ్ళే సమయంలో టోపీ పెట్టుకోవాలని,గొడుగును ఉపయోగించాలని, చెమటను పీల్చే తేలికపాటి దుస్తులు ధరించడం మంచిదని సూచించారు. వడదెబ్బకు గురైనట్లు గమనించిన వెంటనే వారిని చల్లని గాలి తగలినివ్వాలని, బిగుతుగా వున్న దుస్తులు వదులు చేసి ఫ్యాన్ గాలి కిందకు చేర్చి విశ్రాంతి కల్పించాలని, మంచినీటిలో ఉప్పు,తగినంత పంచదార కలిపి తాగించాలని, అప్పుడప్పుడు తడి బట్టతో శరీరంపై తుడవాలని, కొబ్బరినీళ్లు, ఓఆర్ఎస్ పొడి కలిపిన నీళ్ళు,పండ్ల రసాలను తాగించాలని, నివాస గృహాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, బయట ఎక్కడబడితే అక్కడ ఆహార పదార్థాలను తీసుకోకూడదని తదితర అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

$$$__________@@@__________$$$

కాంగ్రెస్ పార్టీకి మండల నాయకులు రాజీనామా

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్19(విజయస్వప్నం.నెట్)

మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కే.రామాంనేయులు శుక్రవారం పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.గత పదేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు నిర్వహించి,పార్టీ బలోపేతానికి కృషి చేసినట్లు ఆయన పేర్కొంటూ.... కొన్ని కారణాల వల్ల ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు.మండల అధ్యక్షులు రామాంజనేయులుతో పాటు కార్యవర్గ సభ్యులు బి.చంద్రశేఖర్ నాయుడు,ఇ.కిష్టప్ప,ఏస్.జీ.రెడ్డిలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బాలాజీ మనోహర్ కు పంపినట్లు తెలిపారు.

$$$__________@@@__________$$$

వైకాపా కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి


శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్19(విజయస్వప్నం.నెట్)

అమడగూరు మండలంలోని మహమ్మదాబాద్ పంచాయతీ గ్రామంలో శుక్రవారం పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు దుద్దుకుంట కిషన్ రెడ్డి వైకాపా కార్యాలయాన్ని ప్రారంభించినట్లు వైకాపా శ్రేణులు తెలిపారు.అనంతరం మహమ్మదాబాద్ పంచాయతీ పరిధిలో గొల్లపల్లి వడ్డిపల్లి మహమ్మదాబాద్ గ్రామాల్లో ఆయన పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు.అనేక సంక్షేమ పథకాలు అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేయాలని, పుట్టపర్తి ఎమ్మెల్యేగా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరినట్లు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి