17, ఫిబ్రవరి 2024, శనివారం

కార్మిక చట్టాలు అమలు చేయాలి - ఉద్యమ కార్యాచరణను జయప్రదం చేయండి:డీటీఎఫ్ -ఆంధ్ర రంజీ జట్టుకు మచ్చా దత్తారెడ్డి ఎంపిక

కార్మిక చట్టాలు అమలు చేయాలి 
సిఐటీయు నాయకులు, కార్మికులు రాస్తారోకో 


శ్రీసత్యసాయిజిల్లా ఫిబ్రవరి16(విజయస్వప్నం.నెట్)

బుళదేవర చెరువు మండల కేంద్రంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియూ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నాయకులు కార్మిక చట్టాలను అమలు చేయాలని శుక్రవారం తహసిల్దార్ కార్యాలయం నుండి ర్యాలీ చేపట్టి బస్టాండ్ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.... పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి. లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని,రైతు రుణాలను మాఫీ చేయాలని,రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని,మోటార్లకు మీటర్లు బిగించే విధానాన్ని రద్దు చేయాలని,రైతులకు సబ్సిడీలు తగ్గించే విధానాన్ని వ్యతిరేకించాలని,రైతుల ఆత్మహత్యలు ఆపాలని,కార్మికులకు సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26 వేల రూపాయలు ఇవ్వాలని,గ్రాడ్యువిటి సౌకర్యం కల్పించాలని,పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని,రవాణా రంగం పేరుతో రోడ్డు భద్రత చట్టం పేరుతో డ్రైవర్లకు ఉరితాడు తగ్గించే విధానాన్ని రద్దు చేయాలని,ఫైన్లు చలానాలో రద్దు చేయాలని,హిట్ అండ్ రన్ కేసులను రద్దు చేయాలని,ప్రజలపై భారాలను తగ్గించాలి డిమాండ్ చేసారు. భవన నిర్మాణ కార్మికులకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని,గుర్తింపు కార్డులు ఇవ్వాలని,సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని,జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూలీలకు 200 రోజులు పని కల్పించాలని,600 రూపాయలు రోజుకు వేతనం ఇవ్వాలని నినాదాలు ర్యాలీగా వెళ్లి రాస్తారోకో చేపట్టారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు కుల్లాయప్ప,మండల కార్యదర్శి శ్రీరాములు,భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు అధ్యక్షులు కేశప్ప,కార్యదర్శి సూర్యనారాయణ,శ్రీనివాసులు,రమణ,మనీ,మహేష్ బాబు,ఎం.శ్రీనివాసులు, రమణప్ప,స్వచ్ఛభారత్ కార్మికులు అంజనప్ప,భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

______________________________

ఉద్యమ కార్యాచరణను జయప్రదం చేయండి:డీటీఎఫ్
(27న ఛలో విజయవాడ)

ఓబుళదేవరచెరువు,ఫిబ్రవరి 16(విజయస్వప్నం.నెట్)

ద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై ఎపిజెఎసి చేపట్టిన ఉద్యమ కార్యాచరణను జయప్రదం చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటిఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ శుక్రవారం వారం ఓ ప్రకటనలో కోరారు.రాష్ట్రంలో 13 లక్షల మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి ఉద్యమించాలని ఎపి జెఎసీ తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటించినట్లు పేర్కొన్నారు.12వ పిఆర్సీలో మద్యంతర భృతి(ఐఆర్) 30 శాతం తక్షణమే చెల్లించాలని,పెండింగ్లో ఉన్న రెండు కొత్త డిఎలు వెంటనే విడుదల చేయాలని,అన్నీ నెట్వర్కు ఆసుపత్రుల్లో ఈ హెచ్ఎస్ వైద్యులచే నగదు రహిత వైద్యసేవలు అందించాలని,2004 సెప్టెంబరు 1 ముందు నోటిఫై అయ్యి అనంతరం నియామకమైన ఉపాధ్యాయులు,ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ (ఓపిఎస్)ను అమలు చేయాలని,టీచర్లకు అప్రెంటీస్ విధానం రద్దు చేయాలని,జీవో నెంబరు.117ను రద్దు చేయాలని,ప్రతి నెలా 1వ తేదీన జీతాలు,పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపద్యంలో ఎపిజెఎసీ ఇచ్చిన కార్యాచరణ ప్రణాళికను ఉద్యోగ,ఉపాధ్యాయులు అందరూ అమలు చేయాలని కోరారు.ఈనెల 14,15న నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన ఉద్యోగ ఉపాధ్యాయులు అందరికీ విదితమే,16న మధ్యాహ్న భోజన విరామ సమయంలో కార్యాలయాలు,పాఠశాలల్లో నిరసన వ్యక్తం చేశారని,17న తాలూకా కేంద్రాల్లో ధర్నా,ర్యాలీలు నిర్వహించాలని,20న జిల్లా కేంద్రంలో ధర్నా,ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు.మండల కేంద్రంలో ధర్నా,ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు.21 నుండి 24 వరకు జిల్లా కేంద్రంలో పర్యటనలు,27న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎపిజెఎసీ పిలుపు మేరకు కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఉద్యోగ,ఉపాధ్యాయులు అందరూ తమవంతు సహకారం అందించి,తమ హక్కులు,న్యాయమైన డిమాండ్లు సాధనలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరసింహులు,సోమశేఖర్ నాయక్,వెంకట చలమయ్య, నాగరాజు,టోపివలి,శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

______________________________


శ్రీసత్యసాయిజిల్లాఫిబ్రవరి16(విజయస్వప్నం.నెట్)

నంతపురం జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి శ్రీ మాణిక్యం టాగూర్ ని,సిడబ్ల్యుసి మెంబెర్ రఘువీరా రెడ్డిని, రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి,నేషనల్ ఓసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అధ్యక్షులను,రాయలసీమ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్,ఎస్టీసెల్ రాష్ట్ర చైర్మన్  శాంతి కుమార్ ని,ఎస్సీ సెల్ చైర్మన్ సాక శంకర్ ని,సత్య సాయి జిల్లా డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి కదిరి శాసనసభ అభ్యర్థిగా ప్రతిపాదించిన దరఖాస్తు పరిశీలన చేయాలని,కదిరి నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి కోసం శాయశక్తుల కృషి చేస్తానని, నాయకులు, కార్యకర్తలతో కలసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం శ్రమిస్తానని విజ్ఞప్తి చేసినట్లు బోగిటి మునికుమార్(సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి)విజయస్వప్నం ప్రతినిధికి తెలిపారు.

______________________________

ఆంధ్ర రంజీ జట్టుకు  మచ్చా దత్తారెడ్డి ఎంపిక


చిన్న వయసులో రంజీ జట్టుకి ఎంపికై చరిత్ర సృష్టించిన మచ్చా దత్తారెడ్డి
జర్నలిస్టు బిడ్డ ఆంధ్ర రంజి జట్టుకు
అనంత జిల్లా క్రికెట్ చరిత్రలో నూతన అధ్యాయం
(శ్రీసత్యసాయి జిల్లా/అనంతపురం)ఫిబ్రవరి16విజయస్వప్నం.నెట్(విజయస్వప్నం.నెట్)

జిల్లాకు చెందిన యువ క్రికెటర్  దత్తారెడ్డి ఆంధ్ర రంజి జట్టుకి ఎంపికయ్యారు ఆంధ్ర రంజి జట్టుకి ఎంపికైనట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఆర్ గోపీనాథ్ రెడ్డి అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కి సమాచారం ఇచ్చారు.మచ్చా దత్త రెడ్డి బాల్యం నుండి క్రికెట్లో రాణిస్తున్నారని,జర్నలిస్టు ఉద్యమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి కుమారుడు దత్త రెడ్డి,జర్నలిస్టు కుటుంబం నుంచి ఆంధ్ర రంజి జట్టుకి ఎంపికైన మొట్టమొదటి క్రికెటర్ మచ్చా దత్తారెడ్డి అని తెలిపారు.రాయలసీమ క్రికెట్ చరిత్రలో అతి చిన్న వయసులో 19 సంవత్సరాల 4 నెలలకు ఆంధ్ర రంజి టీంకి ఎంపీక కావడం ఒక చరిత్ర ఇప్పటివరకు రాయలసీమ నుంచి ఇంత చిన్న వయసులో ఆంధ్ర రంజి జట్టుకి ఎవరు కూడ ఎంపికకాలేదని,అనంతపురం జిల్లాకు చెందిన మచ్చా దత్తారెడ్డి అతి చిన్న వయసులో ఆంధ్ర రంజి జట్టుకి ఎంపికైన తొలి క్రికెటర్ గా రికార్డ్ సృష్టించారన్నారు.మచ్చా దత్త రెడ్డి గత ఏడాది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వహించిన అండర్ 19 అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచారని,ఆంధ్రా జట్టుకు ఆడుతూ రెండు సెంచరీలతో 500 పరుగులు చేశారని,వికెట్ కీపర్ గా 20 కి పైగా క్యాచులు, స్టమ్పింగ్లు సాధించారని,దేశంలో హైయెస్ట్ స్ట్రైక్రేటర్ గా మొట్టమొదటి ప్లేయర్ గా నిలిచారన్నారు.హర్యానాతో జరిగిన మ్యాచ్లో 172 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారని,మణిపూర్ రాష్ట్ర జట్టుతో జరిగిన మ్యాచ్లో 105 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారని,రెండు సెంచరీలు చేసి నాటౌట్ గా నిలిచి ఆకట్టుకున్నారు.గత అరేళ్లుగా ఆంధ్ర జట్టులో ఉంటూ అనేక ఏజ్ గ్రూపులో అద్భుతంగా రాణించారనిఅంతకుముందు సంవత్సరం కూడా అండర్ 19 అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీల్లో అద్భుతంగా రాణించారని,300కు పైగా  పరుగులు సాధించి వికెట్ కీపింగ్ లో 30 క్యాచ్లు స్టాంపింగ్లు చేసి ఎన్.సీ.ఏ నేషనల్ క్రికెట్ అకాడమీ క్యాంప్ కి ఆంధ్ర జట్టు తరఫున ఎంపికయ్యారన్నారు.ఈఏడాది అండర్ 23 అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీల్లో మొదటి మ్యాచ్ లోనే గోవా జట్టుపై 104 పరుగులు సెంచరీ సాధించి నాటౌట్ గా నిలిచారని,అండర్ 23 అంతరాష్ట్ర పోటీల్లో మొదటి మ్యాచ్ సెంచరీ చేసిన క్రికెటర్ గా రికార్డ్ సృష్టించారని పేర్కొన్నారు.మచ్చ దత్తారెడ్డి ప్రతిభను గుర్తించిన ఆంధ్ర క్రికెట్ సంఘం ఆంధ్ర రంజి జట్టుకి ఎంపిక చేసి ప్రోత్సాహాన్ని అందించింది కేరళతో జరిగే ఆంధ్ర రంజీ మ్యాచ్ విజయనగరంలో జరిగే టోర్నమెంట్ కు మచ్చా దత్తారెడ్డిని ఆంధ్ర రంజి జట్టుకి ఎంపిక చేసిందని,ఇప్పటివరకు అన్ని ఏజ్ గ్రూపులలో ఆంధ్ర రాష్ట్ర జట్టుకి ఎంపికై రాణించారు దత్తారెడ్డి అండర్ 12, అండర్ 14, అండర్ 16, అండర్ 19 ఏజ్ గ్రూపులలో ఆంధ్ర రాష్ట్ర జట్టుకి ఎంపికై రాణించారు గత అరేళ్లుగా ఆంధ్ర రాష్ట్ర జట్టుకు ఆడుతూ అద్భుతంగా రాణించారని,అద్భుతంగా రాణించడంతో రంజీ జట్టుకి ఎంపిక అయ్యే అవకాశం వచ్చిందని,శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ జట్టుకు దత్తారెడ్డి కెప్టెన్ గా వ్యవహరించారన్నారు.దత్తారెడ్డి క్రికెట్లో అద్భుతంగా రాణించడంతో గుర్తించిన ఆంధ్ర క్రికెట్ సంఘం ఆంధ్ర సీనియర్ సెలక్షన్ కమిటీ దత్తారెడ్డిని రంజీ జట్టుకి ప్రమోషన్ ఇచ్చి ఎంపిక చేసిందని,ఆంధ్ర జట్టులో అతి చిన్న వయసు కలిగిన క్రికెటర్గా దత్తారెడ్డి జట్టులో చేరనున్నారు మచ్చా దత్తారెడ్డి ఆంధ్ర రంజీ జట్టుకు ఎంపీ కావడం పట్ల ఆర్డిటి ప్రోగ్రాం డైరెక్టర్ మ్యాంచో ఫెర్రర్,అనంతపురం జిల్లా క్రికెటర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి,జిల్లా కార్యదర్శి మధు, ఇతర అసోసియేషన్ సభ్యులు సీనియర్ క్రికెటర్లు మచ్చా దత్తారెడ్డిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతపురం జిల్లాలో రాబోవు రోజుల్లో మచ్చా దత్తారెడ్డి రంజీ జట్టుకు ఎంపీక కావడం పట్ల క్రికెట్ అభివృద్ధికి దోహదం పడుతుందని,జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఆశభావం వ్యక్తం చేశారు.

______________________________

శ్రీసత్యసాయిజిల్లా(విజయస్వప్నం.నెట్)

డిచెరువు మండల కేంద్రంలోని బీసీ కాలనీ అంdగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయం పరిపాలన అధికారి పూల రెడ్డప్ప సందర్శించి డి వార్మింగ్ డేపై అవగాహన కలిపించి, నూలి పురుగుల పంపిణి మందులు పరిశీలించి,నూలి పురుగుల నివారణ దినోత్సవం సందర్బంగా నూలి పురుగుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చిన్నారుల తల్లిదండ్రులకు అయన వివరించారు. అంగన్వాడీ భోధకులు అఖిల,మాధవి,ఆశ కార్యకర్త బిబి తదితరులు పాల్గొన్నారు.

______________________________




 శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో శుక్రవారం రధసప్తమి సందర్బంగా శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నుండి స్వామివారిని వివిధ పుష్ప్తాలతో సూర్యప్రభ అలంకరణ చేపట్టి పురవీధుల గుండా భక్తుల దర్శనం కోసం ఉత్సవ ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. కాయకర్పూరం సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకొన్నారు.

______________________________

మేము యాచకులం కాదు పాలకులం
మాకు న్యాయంగా దక్కాల్సిన వాటాను మాకు కేటాయించండి         
రాయల్ పీపుల్స్ ఫ్రంట్   కదం తొక్కిన కదిరినియోజకవర్గ బలిజలు


శ్రీసత్యసాయిజిల్లా,కదిరి ఫిబ్రవరి 16 (విజయస్వప్నం.నెట్)

శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం వ్యాప్తంగా బలిజలు ఏకమై శ్రీకృష్ణదేవరాయల జయం సందర్భంగా కదిరిలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు.భారీ జన సందోహం మధ్య శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేడు రాజకీయ పార్టీలు తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం శ్రీ కృష్ణ దేవరాయల ఖ్యాతిని తగ్గించాలనే కుట్రలో భాగంగా బలిజ కులస్థులకు  రాజ్యాధికారం దూరం చేస్తూ.... న్యాయంగా బలిజలకు దక్కాల్సిన హక్కులను హరిస్తోందన్నారు.తస్మాత్ జాగ్రత్త బలిజ కులస్తులను విస్మరిస్తే రాజకీయపార్టీలకు పతనం తప్పదని హెచ్చరించారు.రాష్ట్ర ప్రభుత్వాలే అధికారికంగా శ్రీ కృష్ణ దేవరాయల జయంతిని ప్రతి ఏటా ఘనంగా జరపాల్సింది పోయి కదిరి పట్టణంలో శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహం ఏర్పాటును అడ్డుకొని మా బలిజ కులస్తులపై అక్రమ కేసులు బనాయించారన్నారు. ఇది ముమ్మాటికీ మా బలిజ కులస్థుల ఆత్మ గౌరవాన్ని దెబ్బకొట్టినట్లుగానే భావిస్తున్నామని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు,బలిజ,ఒంటరి మున్నారు కాపు కులస్తులు సైతం రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. బలిజల ఐక్యతను అడ్డుకోవాలని చూస్తున్నారని,రాజ్యం వీర భోజ్యం,మేము యాచకులం కాదు పాలకులం,మాకు న్యాయంగా దక్కాల్సిన వాటాను మాకు కేటాయించండి లేదా భవిష్యత్  పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపున రాజకీయ పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నామన్నారు.రత్నాలను రాశులుగా పోసి అమ్మిన ఘనత , కొన్ని వేల సంఖ్యలో చెరువులను తవ్వించి నేటికీ వాటికి పటిష్టమైన ఆనకట్టలను నిర్మించి లక్షల రైతులకు పాడి పంటల కోసం త్రాగునీటి అవసరాల కోసం తవ్వించిన గొప్ప ముందుచూపు ఉన్న చక్రవర్తి,దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాష గొప్పదనాన్ని దేశానికి చాటిన మహనీయులు,నేటి ఆధునిక విజ్ఞానానికి సైతం అంతు చిక్కని శిల్పకళా నైపుణ్యత ఆయన సొంతం. రాజకీయం అనే అక్షరాలను దేశానికి పరిచయం చేస్తూ అష్టదిగ్గజాల పేరుతో శాఖలను ఏర్పాటు చేసి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా పరిపాలన అందించిన రారాజు ఆంధ్రభోజుడు శ్రీ కృష్ణ దేవరాయలని,నేడు ఆయన జయంతి సందర్భంగా కదిరి తాలూకా పరిధిలో ఉన్న యావత్ బలిజలంతా ఏకతాటిపై ఆయన గొప్పదాన్ని తెలిపే విధంగా కదిరి పట్టణ పురవీధుల్లో బలిజల శంఖారావం పేరుతో బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించి ఆయన కీర్తిని నేటి తరానికి తెలిసేలా ఈ ర్యాలీ కొనసాగడం అభినందనీయమన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి