1, ఫిబ్రవరి 2024, గురువారం

మార్చ్ ఫాస్ట్ లో విద్యార్థికి ప్రశంసాపత్రం

 శ్రీసత్యసాయిజిల్లా,గోరంట్ల




ఓడిచెరువు ఫిబ్రవరి01  - మండలంలోని అల్లాపల్లి పంచాయతీ గౌనిపల్లి గ్రామానికి చెందిన నూలు మునిస్వామి,నిర్మలమ్మ దంపతుల కుమారుడు నూలు రాజు గోరంట్ల మండలంలోని  బెస్ట్ ఇన్నోవేషన్  యూనివర్సిటీ కళాశాలలో  గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మార్చ్ ఫాస్ట్ లో పాల్గొని ఉత్తమ ప్రదర్శన కనబరచడంతో  యువకుడు నూలు రాజుకి కళాశాల యాజమాన్యం చిదానంద ప్రశంస పత్రం అందించారు.గౌనిపల్లి గ్రామ ప్రజలు, విద్యార్థి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

__________________________________________________________

వైకాపా నుండి తెదేపాలోకి పలువురు చేరిక



 శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఫిబ్రవరి01 - రాబోయే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు.

వైసీపీ పాలనలో విసిగిపోయిన నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని,అమడగూరు మండలంలోని కస్సముద్రం,నిలువురాతిపల్లికి చెందిన 50 కుటుంబాలు గురువారం వైకాపా వీడి తెదేపాలోకి  మాజీ మంత్రి పల్లె ఆధ్వర్యంలో చేరిన సందర్బంగా ఆయన పేర్కొన్నారు.తెదేపా నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

___________________________________________________________

ప్రకృతి పరిరక్షణలో మేము సైతం:-ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు


అనంతపురం ఫిబ్రవరి01 - అనంతపురం పట్టణంలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో గురువారం ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో బాటనీ విద్యార్థులకు సమావేశం ఏర్పాటు చేసి మొక్కలు,చెట్లు,తీగలు,గడ్డి, అటవీ సంపద యొక్కవిశిష్టత, భూమిపైగల సమస్త జీవరాసులకు జీవనాధారమైన వీటన్నింటినీ సమృద్ధిగా పెంచుకోకపోతే భవిష్యత్తులో ఆహారం,గాలి,నీరు,ఎకో సిస్టం, సాయిల్ కన్జర్వేషన్,టెంపరేచర్ బ్యాలెన్స్ తదితర విషయాలలో ఎంతగానో నష్టపోవాల్సి వస్తుందని,వీటన్నింటిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.భవిష్యత్తులో వీటిని కాపాడుకోవడానికి విద్యార్థి దశలో అవగాహనతో ముందుంటారని.సమాజంలో ప్రజలు శక్తివంతంగా,జ్ఞానవంతంగా, బాధ్యతగా జీవించాలంటే,చెట్ల యొక్క పాత్ర ఎంతో ఉందని విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు.ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ నాయక్,బాటనీ హెచ్ ఓ డి రఘు,కళాశాల ఇన్చార్జ్ లెక్చరర్ లక్ష్మి,కళాశాల అధ్యాపకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

____________________________________________________________

ఉచిత వివాహ కార్యక్రమానికి  ఎస్ఐకి ఆహ్వానం 



ఓబుళదేవరచెరువు ఫిబ్రవరి01 - మండల కేంద్రానికి అతి సమీపంలో ఎం.కొత్తపల్లి బంగారు బండపై వెలసిన శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామివారి దేవస్థానం ఆవరణలో శ్రీలక్ష్మినరసింహస్వామి సన్నిధిలో ఈనెల 14వతేది(మాఘుమాసం)కదిరి జోగి శ్రీదేవి ఫౌండేషన్ చైర్మన్ కోడూరు శ్రీకాంత్, ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించే 11 జంటల వధూవరులకు సామూహిక వివాహ కార్యక్రమంలో పాల్గొనాలని గురువారం పోలీసుస్టేషన్ లో ఎస్ఐ మల్లికార్జునరెడ్డిని చైర్మన్ కోడూరు శ్రీకాంత్, ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు మర్యాద పూర్వకంగా కలసి ఆహ్వానపత్రిక అందజేశారు.శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామివారి ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు పలువురి సహాయ సహకారాలతో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.... ఇలాంటి సామూహిక ఉచిత వివాహ శుభ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడడం,అభినందనీయమని ఎస్ఐ మల్లికార్జునరెడ్డి కొనియాడారు.జోగి శ్రీదేవి ఫౌండేషన్ చైర్మన్ శ్రీకాంత్ సహకారంతో ఉచిత వివాహాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు ఈసందర్బంగా తెలిపారు.ఈకార్యక్రమంలో ఆలయ సేవకులు సీసి కెమెరా శంకర,డప్పు నరేష్,సర్వేయర్ గంగులప్ప,రాధాకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

___________________________________________________________


విద్యుత్ షాక్ గురై వ్యక్తి కూలి మృతి




శ్రీ సత్యసాయి జిల్లా ఫిబ్రవరి 01 - మండలంలోని తుమ్మలకుంట్లపల్లి గ్రామానికి చెందిన నంజప్ప నాయుడు(65)గురువారం విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ బి. మల్లికార్జునరెడ్డి తెలిపారు.మృతుడు నజ్జప్ప నాయుడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారని,31 సాయంత్రం (బుధవారం)తూవంకపల్లి (బడావండ్లపల్లి)చెందిన వెంకటరామిరెడ్డి నాజ్జప్ప నాయుడుకి ఫోన్ చేసి తన పొలంలో విద్యుత్ తీగ తెగిపోయిందని తెలిపగా....కరెంట్ వైర్ లాగడానికి పొలం వద్దకు రమ్మని పిలవడంతో వెంటనే గ్రామానికి చేరుకొని ఇద్దరు కలిసి కరెంట్ పని చేసుకుంటూ ఉండగా అనుకోకుండా విద్యుత్ తీగ తగిలి షాక్  గురై పడిపోయినాడని వెంటనే అక్కడికి వెళ్లి చూడగా మృతి చెందారని మృతుడు నజ్జప్ప నాయుడు కుమారుడు చంద్రశేఖర్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతిడిని పోస్ట్ మార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.

__________________________________________________________




శ్రీసత్యసాయి జిల్లా కదిరి, ఫిబ్రవరి01 - కదిరి పట్టణానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి గురువారం విచ్చేసి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గోని సమీక్షించి, అనంతరం నవ నారసింహ స్వామి క్షేత్రం ప్రహ్లాద సమేత స్వయంభూ వెలసిన శ్రీ మధ్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శనం చేసుకొన్నట్లు జనసేన డివిజన్ కార్యదర్శి కూటల లక్ష్మణ్ తెలిపారు.
________________________________________________________
ఫాదర్ ఫెర్రర్ జర్నలిస్ట్ క్రికెట్ టోర్నీ లో కదిరి కి రెండవ విజయం
మడకశిర జట్టు పై కదిరి జట్టు విజయం

శ్రీసత్యసాయి జిల్లా,కదిరి - ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతపురం పట్టణ ఆర్డీటి మైదానంలో నిర్వహిస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ గురువారం రెండవరోజుకు చేరుకుంది.ముఖ్య అతిథిగా ఏపీడబ్ల్యుజేయు కార్యదర్శి విజయరాజు హాజరై టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు.మధ్యాహ్నం బి గ్రౌండ్ లో మడకశిర,కదిరి జట్లు తలపడగా మడకశిర టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 15ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది.బౌలర్ భారత్ మూడు ఓవర్లకు 12 పరుగులు ఇచ్చి కీలక 2 వికెట్లు తీశారు.అనంతరం బ్యాటింగ్ చేసిన కదిరి జట్టు 12.5 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.అద్భుత అట ప్రదర్శనతో లోకు 40,భరత్ రాయల్ 36 పరుగులు చేయగా చివరిలో యూనిస్,దావుద్ ధాటిగా ఆడి జట్టు విజయానికి దోహదపడ్డారు.వరుసగా రెండవసారి న్ ఆఫ్ ది మ్యాచ్ కు ఎంపికయ్యారని జట్టు క్రీడాకారులు తెలిపారు.
________________________________________________________



శ్రీసత్యసాయి జిల్లా, పుట్టపర్తి - పుట్టపర్తి పట్టణ ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం పుట్టపర్తి నియోజకవర్గంలో జగనన్న గృహాలు నిర్మించుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సకాలంలో బిల్లులు చెల్లించాలని,సిమెంట్ పంపిణీ,బిల్లులు చెల్లించడంలో అలసత్వం వహించకూడదని సూచిస్తూ.... శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి హౌసింగ్ అధికారుల సమావేశంలో సమీక్ష నిర్వహించారు.
_______________________________________________________
భాదితుల కుటుంబాలను  పరామర్శించిన మాజీమంత్రి పల్లె 



శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం - అమడగూరు మండలం తిమిరికుంటపల్లిలో పలువురు బాధితుల కుటుంబాలను గురువారం రాత్రి మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పరామర్శించి ఆర్థిక సాయం అందించి,కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అండదండలు ఎల్లవేళలా ఉంటాయని హామీ ఇచ్చారు. అలాగే ఓడిచెరువు మండలం తంగేడుకుంట గ్రామానికి చెందిన తలారి శివప్ప అనారోగంతో బాధపడుతున్నా విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి  వారి స్వగ్రామానికి వెళ్లి భాదితుడిని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అనంతరం వైద్యాధికారికి ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారని తెదేపా శ్రేణులు తెలిపారు.
_______________________________________________________
జలాశయంలో మృతదేహం


ఉపాధ్యాయుడి ఫైల్ ఫోటో
ఉపాధ్యాయుడి మృతదేహం లభ్యం శ్రీ సత్య సాయిజిల్లా,కదిరి ఫిబ్రవరి01(విజయస్వప్నం. నెట్)కదిరి మండలం చెర్లోపల్లి రిజర్వాయరులో గురువారం మహేందర్ రెడ్డి అనే ఉపాధ్యాయుడి మృతదేహం లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు.
అమడుగూరు మండలం, గుండువారిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.మృతుడు ఉపాధ్యాయుడు మహేందర్ రెడ్డి స్వగ్రామం నల్లమాడ మండలం బాసంవారిపల్లిగా కదిరి పోలీసులు గుర్తించి
మృతిపై విచారణ చేస్తున్నట్లు సమాచారం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి